నారాయణ్ ఖేడ్ వెలుగు: గీతా జయంతి పురస్కరించుకొని నారాయణఖేడ్ పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ ఆలయంలో ఆరు నెలల నుంచి కొనసాగుతున్న గీతా పారాయణ ముగింపు సందర్భంగా సోమవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గీతా శ్లోకాల, డ్రాయింగ్ కాంపిటీషన్ కు స్టూడెంట్స్ నుంచి చక్కని స్పందన లభించింది. పట్టణంలోని పదిహేను ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి 235 మంది స్టూడెంట్స్ పాల్గొన్నారు.
ఇందులో డ్రాయింగ్ జూనియర్,సీనియర్ విభాగాల్లో పల్లవి శిశు మందిర్ స్కూల్ మొదటి, అక్షర జడ్పీహెచ్ఎస్ రెండో, లోహిత్ రాజ్ సరస్వతీ శిశు మందిర్ స్కూల్ తృతీయ బహుమతిన్యాయ నిర్ణీతలుగా నందాల పండరి, వడ్ల రాజయ్య వ్యవహరించారు. కార్యక్రమంలో రామకృష్ణ, ఆలయ కమిటీ బాధ్యులు వివిధ పాఠశాల టీచర్లు, తల్లిదండ్రులు, స్టూడెంట్స్ పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు, స్టూడెంట్స్ కు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు.
