
APకి ప్రత్యేక హోదా ఇచ్చి… ఆదుకోవాలన్నారు సీఎం జగన్, నీతి ఆయోగ్ మీటింగ్ లో పాల్గొన్న జగన్ రాష్ట్రంలోని పరిస్థితిని వివరించారు. హోదా లభిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు, మౌలిక వసతులు సమకూరుతాయన్నారు. మరోవైపు పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యహాలపై పార్టీ ఎంపీలకు సూచించారు జగన్.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రధాని మోడీతో పాటు…. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ముందుంచారు AP సీఎం జగన్ మోహన్ రెడ్డి. రెండు రోజుల ఢిల్లీ టూర్ లో భాగంగా…. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న జగన్… రెవెన్యూ లోటు భర్తీ, ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరించారు. మరోవైపు రాష్ట్రంలోని పరిస్థితిపై అధికారులందరికీ ఎనిమిది పేజీల లేఖను అందజేశారు. రాష్ట్ర విభజన సమయంలో హోదా ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చిందని… హోదా లభిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు, మౌలిక వసతులు సమకూరుతాయన్నారు.
రాష్ట్రంలో ఉపాధి కల్పన అవకాశాలు దారుణంగా పడిపోయాయన్నారు జగన్. యువత వలసలు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయాన్నారు. గత ఐదేళ్లలో అవినీతితో కూడిన పాలన జరగటంతో రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. పెట్టుబడులు రాకపోవటంతో ఖజానా ఖాళీ అయ్యిందన్నారు జగన్.
అంతకు ముందు AP భవన్ లో YCP పార్లమెంటరీ పార్టీ మీటింగ్ నిర్వహించారు జగన్. 17 నుంచి మొదలయ్యే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు, ప్రత్యేక హోదాపై ఉభయసభల్లో వినిపించాల్సిన వాయిస్ పై పార్టీ ఎంపీలకు పలు సూచనలు చేశారు. లోక్ సభలో నాలుగో అతి పెద్ద పార్టీగా YCP ఉందన్న జగన్…. దీన్ని ఒక అవకాశంగా భావించాలన్నారు. APలో ఎంపీల గౌరవం పెరిగేలా, హుందాగా వ్యవహరిస్తూ సభా కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలియజేశారు.
పార్లమెంటరీ పార్టీ సమావేశం తర్వాత కర్ణాటక సీఎం…. కుమరస్వామితో భేటీ అయ్యారు జగన్. ఈ సందర్భంగా శాలువతో సన్మానించిన జగన్…మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు. రెండు రోజుల పర్యటన ముగించుకొని తిరిగి రేపు….అమరావతికి చేరుకోనున్నారు AP సీఎం జగన్.