లోకల్ కోటా కింద ఎంబీబీఎస్ సీటు ఇవ్వండి: హైకోర్టు

లోకల్ కోటా కింద ఎంబీబీఎస్ సీటు ఇవ్వండి: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: ఒకటి నుంచి పదో తరగతి దాకా తెలంగాణలో చదివి, తర్వాత ఇంటర్ చెన్నైలో పూర్తి చేసిన స్టూడెంట్ ప్రశంస రాథోడ్​కు ఎంబీబీఎస్ సీటు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, కాళోజీ హెల్త్ వర్సిటీకి హైకోర్టు ఆదేశించింది. లోకల్ కోటా కింద ఎంబీబీఎస్ సీటు కేటాయింపు.. తాము చెప్పే తుది తీర్పునకు అనుగుణంగా ఉంటుందని చీఫ్ జస్టిస్ తో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. ప్రశంస రాథోడ్ తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగులు. విధి నిర్వహణలో భాగంగా వాళ్లు చెన్నైకి ట్రాన్స్ ఫర్ అయ్యారు. దీంతో ఆమె ఇంటర్ అక్కడే కంప్లీట్ చేసింది. 

నీట్ రాసిన ఆమెను నాన్ లోకల్ కోటా కింద పరిగణిస్తామని అధికారులు చెప్పారు. దీంతో జీవో 114ను సవాల్ చేస్తూ ప్రశసం రాథోడ్ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీన్ని చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్ కుమార్​తో కూడిన డివిజన్​ బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది. ప్రశంస రాథోడ్​కు లోకల్ కోటా కింద ఎంబీబీఎస్ సీటు కేటాయించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.