సీఏఏ ఎందుకు వద్దో చెప్పండి?: బండి సంజయ్

సీఏఏ ఎందుకు వద్దో చెప్పండి?: బండి సంజయ్

కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎంలపై ఎంపీ​ ఫైర్​

హైదరాబాద్‌, వెలుగు: సిటిజన్​షిప్​ అమెండ్​మెంట్​ యాక్ట్(సీఏఏ), నేషనల్​పాపులేషన్​ రిజిస్టర్(ఎన్​పీఆర్) లను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఒక్క కారణమన్నా చెప్పాలంటూ కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం, వామపక్షాలను ఎంపీ బండి సంజయ్ నిలదీశారు. ఈ వ్యతిరేక ఆందోళనలన్నీ దేశద్రోహుల కుట్రేనని ఆయన ఆరోపించారు. అస్సాం వంటి రాష్ట్రాల్లో ఇస్లామిక్​ దేశాల నుంచి వస్తున్న నిధులతో విపక్షాలు ఆందోళనలు జరిపిస్తుండగా.. మన రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్​ పార్టీ డబ్బులిచ్చి ఆందోళనలు చేయిస్తోందని ఆరోపించారు. హిందువులకు తాము వ్యతిరేకం కాదని నిజామాబాద్​ సభలో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్​ ఓవైసీ ప్రకటించడం కంటితుడుపు చర్యేనని విమర్శించారు. హిందువులపై వ్యతిరేకత లేకుంటే దేశంలో 15 నిమిషాలు తప్పుకుంటే హిందువులను అంతం చేస్తామన్న కామెంట్​కు అర్థమేమిటని అడిగారు.  ఇక లౌకిక పార్టీ అని చెప్పుకునే టీఆర్ఎస్..​ సీఏఏ, ఎన్​పీఆర్ లను ఎందుకు వ్యతిరేకుస్తోందని ప్రశ్నించారు. భరతమాతకు జై కొట్టని పార్టీలు కూడా దేశం గురించి మాట్లాడడం విడ్డూరమని  మండిపడ్డారు. జాతీయ జెండా ఎగరవేయను, జనగణమన పాడనన్న అసద్​..  మోడీ పాలన విధానాలతో దిగిరాక తప్పలేదని చెప్పారు.