
హైదరాబాద్, వెలుగు: దేశీయ స్మార్ట్ఫోన్ కంపెనీ ఏఐ ప్లస్ పల్స్, నోవా 5జీ మోడళ్లను లాంచ్చేసింది. ఇవి పూర్తిగా దేశీయంగా డెవలప్చేసిన నెక్స్ట్క్యాంటమ్ఓఎస్ తో పనిచేస్తాయి. పల్స్4జీ ధరలు రూ.ఐదు వేల నుంచి రూ.ఏడు వేల వరకు ఉంటాయి.
నోవా 5జీ ధరలు రూ.ఎనిమిది వేల నుంచి రూ.10 వేల వరకు ఉంటాయి. అమ్మకాలు ఈ నెల 12 నుంచి మొదలవుతాయి. వీటిలో 6.7-అంగుళాల డిస్‌ప్లే, 50-మెగాపిక్సెల్ ఏఐ కెమెరా, 5,000 ఎంఏహెచ్బ్యాటరీ, 18వాట్ల చార్జింగ్, యూనిసాక్ ప్రాసెసర్, 6జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజీ వంటి ప్రత్యేకతలు ఉంటాయి.