
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న సెర్ప్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సెర్ప్ జేఏసీ చైర్మన్ కుంట గంగాధర్ రెడ్డి కోరారు. గురువారం పీఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియాను కలిసి వినతిపత్రం అందజేశారు. పే స్కేల్‌పై రావాల్సిన అలవెన్సులు, పెండింగ్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరారు.
సెర్ప్‌లోని హెచ్ఆర్ డైరెక్టర్ తమ సమస్యలు పరిష్కారం అవ్వకుండా కుట్ర చేస్తున్నారని గంగాధర్ రెడ్డి ఆరోపించారు. సర్వీస్ రూల్స్‌పై మాజీ సీఎం, సీఎస్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చినా అధికారులు అమలు చేయడం లేదన్నారు. ఆరోగ్యం బాగాలేక ఉద్యోగులు పెట్టే అప్లికేషన్‌ను సైతం క్లియర్ చేయకుండా పెండింగ్‌లో ఉంచుతున్నారన్నారు.