మెహిదీపట్నం, వెలుగు: 40 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరు గ్లకోమా పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు సూచించారు. గ్లకోమా వారోత్సవాల సందర్భంగా మెహిదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఆదివారం ఆస్పత్రి నుంచి ఎన్ఎండీసీ వరకు అవగాహన ర్యాలీ తీశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ గ్లకోమా జబ్బు ప్రమాదకరమన్నారు. గ్లకోమా జబ్బు సంభవిస్తే జీవితం అంధకారమవుతుందని ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజలింగం పేర్కొన్నారు. గ్లకోమా వస్తే, టెస్టులు చేసి అంతటితో వ్యాధిని నియంత్రించవచ్చన్నారు. ఈ ర్యాలీలో గ్లకోమా హెచ్ఓడీ ప్రొఫెసర్ డాక్టర్ వెంకటరత్నం, డీఎన్ఏ డాక్టర్ వాణి తదితరులు పాల్గొన్నారు.
