Cricket World Cup 2023: శివాలెత్తిన మ్యాక్స్ వెల్.. వరల్డ్ కప్ లో ఫాస్టెస్ట్ సెంచరీ

Cricket World Cup 2023: శివాలెత్తిన మ్యాక్స్ వెల్.. వరల్డ్ కప్ లో ఫాస్టెస్ట్ సెంచరీ

ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ చెలరేగి ఆడాడు. ఈ వరల్డ్ కప్ లో పెద్దగా ఫామ్ లో లేని మ్యాక్స్ వెల్ ఒక్కసారిగా పూనకం వచ్చినట్టుగా ఆడేశాడు. పసికూన నెదర్లాండ్స్ పై విరుచుకుపడి బౌండరీల వర్షం కురిపించాడు. విధ్వంసకర ఇన్నింగ్స్ తో  వన్డే వరల్డ్ కప్ లో చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసాడు. 

వరల్డ్ కప్ లో బ్యాటర్లు జోరు కొనసాగుతుంది. అందరు బ్యాటర్లు చెలరేగుతుంటే ప్రస్తుతం మ్యాక్స్ వెల్ వంతు వచ్చింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై మ్యాక్సి 40 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసి వరల్డ్ కప్ లో మార్కరం పేరిట ఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును బ్రేక్ చేసాడు. ఇదే వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా బ్యాటర్ మార్కరం శ్రీలంకపై 49 బంతుల్లో సెంచరీ చేసి కెవిన్ ఓబ్రెయిన్ రికార్డ్ బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. 

ALSO READ :- నర్సాపూర్ బరిలో సునీతా లక్ష్మారెడ్డి

మొత్తం 44 బంతుల్లో 106 పరుగులు చేసిన మ్యాక్స్ వెల్ ఇన్నింగ్స్ లో 8 సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి. మ్యాక్స్ వెల్ కి తోడు వార్నర్ (104)శతకం బాదడంతో నెదర్లాండ్స్ పై ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. స్మిత్ (71), లబు షేన్ (62) అర్ధ సెంచరీలతో రాణించారు.