ఆయిల్‌ రేట్లు పైకి!

ఆయిల్‌ రేట్లు పైకి!
  •     యూఎస్‌‌‌‌‌‌‌‌, చైనా, యూరప్‌‌‌‌‌‌‌‌ దేశాలలో పెరుగుతున్న డిమాండ్‌‌‌‌‌‌‌‌
  •     కరోనా కేసులతో ఇండియాలో నెమ్మదించిన వినియోగం

న్యూఢిల్లీ: గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా క్రూడాయిల్‌‌‌‌‌‌‌‌ ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూరప్‌‌‌‌‌‌‌‌లోని చాలా దేశాలలో  కరోనా కేసులు తగ్గుతున్నాయి. దీంతో రాబోయే కొన్ని నెలల్లో గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని, ట్రావెల్‌‌‌‌‌‌‌‌ యాక్టివిటీ మెరుగుపడుతుందని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. దీంతో పాటు యూఎస్‌‌‌‌‌‌‌‌లో ఆయిల్ వినియోగం పెరగడం, చైనా ఎకనామీ రికవరీ అవుతుండడంతో ఆయిల్‌‌‌‌‌‌‌‌కు డిమాండ్ కనిపిస్తోంది. మరోవైపు మూడో అతిపెద్ద ఆయిల్‌‌‌‌‌‌‌‌ వినియోగ దేశమైన ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో చాలా రాష్ట్రాలు రిస్ట్రిక్షన్లు విధించాయి. ఇది క్రూడాయిల్ డిమాండ్‌‌‌‌‌‌‌‌ పడిపోవడానికి కారణమవుతోందని ఎనలిస్టులు తెలిపారు. అతిపెద్ద ఆయిల్ ప్రొడ్యూసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇరాన్‌‌‌‌‌‌‌‌ తన రోజువారి ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌ను పెంచాలని చూస్తోంది. ఈ దేశంపై యూఎస్‌‌‌‌‌‌‌‌ ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కానీ, యూఎస్‌‌‌‌‌‌‌‌ చెప్పిన నూక్లియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీల్‌‌‌‌‌‌‌‌కు ఒప్పుకోవడానికి ఇరాన్ రెడీ అవుతోంది.  ఒకవేళ ఈ డీల్‌‌‌‌‌‌‌‌ సక్సెస్‌‌‌‌‌‌‌‌ అయితే ఇరాన్‌‌‌‌‌‌‌‌పై ఉన్న ఆంక్షలు తొలగిపోతాయి. దీంతో ఈ దేశం తన విలువైన క్రూడాయిల్‌‌‌‌‌‌‌‌ను ఆయిల్‌‌‌‌‌‌‌‌ మార్కెట్లోకి తీసుకొస్తుంది. ఇది క్రూడాయిల్‌‌ ధరలు తగ్గడానికి కొంత కారణమవుతుంది. ఒక విధంగా యూఎస్‌‌ ఆంక్షలు తొలగిపోతే ఇరాన్‌‌‌‌‌‌‌‌ నుంచి ఇండియా ఆయిల్‌‌ను దిగుమతి చేసుకోవడానికి వీలుంటుంది. ఇంకా ఇరాన్‌‌ నుంచి ఆయిల్‌‌ దిగుమతి చేసుకుంటే డాలర్లలో ట్రాన్సాక్షన్‌‌ చేయాల్సిన అవసరం ఉండదు. ఇండియా నుంచి పెద్ద మొత్తంలో ప్రొడక్ట్‌‌లు ఈ దేశానికి ఎగుమతి అవుతుంటాయి  కాబట్టి రూపాయిల్లోనే ట్రాన్సాక్షన్లకు వీలుంటుంది. రూపాయి మారకం విలువ బలపడుతుంది.

ఇండియా చాలా కీలకం..
గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా ఆయిల్ ధరలు నిర్ణయించడంలో ఇండియా కీలకంగా ఉంటోంది. యూఎస్‌‌‌‌‌‌‌‌, చైనా తర్వాత ఆయిల్‌‌‌‌‌‌‌‌ను ఎక్కువగా వాడుతున్న దేశం ఇండియానే. దేశ దిగుమతుల్లో మెజార్టీ వాటా క్రూడాయిల్‌‌‌‌‌‌‌‌దే ఉంటుంది. కానీ, సెకెండ్‌‌‌‌‌‌‌‌ వేవ్‌‌‌‌‌‌‌‌ మొదలయిన తర్వాత దేశంలో కరోనా రిస్ట్రిక్షన్లు పెరిగాయి. పెట్రోల్‌‌‌‌‌‌‌‌, డీజిల్‌‌‌‌‌‌‌‌, ఇతర పెట్రోలియం ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లకు డిమాండ్‌‌‌‌‌‌‌‌ పడిపోతోంది. లోకల్ ఆయిల్ కంపెనీలు తమ రిఫైనరీ ప్లాంట్‌‌‌‌‌‌‌‌లలో ఆక్సిజన్ గ్యాస్‌‌‌‌‌‌‌‌ను ప్రొడ్యూస్ చేసి, హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌కు పంపుతున్నాయి.  గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా క్రూడాయిల్‌‌‌‌‌‌‌‌కు డిమాండ్‌‌‌‌‌‌‌‌ కనిపిస్తున్నప్పటికీ కొన్ని దేశాలలో కరోనా కేసులు పెరుగుతుండడంతో  క్రూడ్‌‌‌‌‌‌‌‌ ధరలు ఇప్పట్లో భారీగా పెరిగే అవకాశాలు లేవు. కానీ, దేశంలో రిస్ట్రిక్షన్లు తగ్గితే మాత్రం పెట్రోల్‌‌‌‌‌‌‌‌, డీజిల్‌‌‌‌‌‌‌‌కు రెక్కలొస్తాయని అంచనా. మరోవైపు 23 కమోడిటీలతో కూడిన బ్లూమ్‌‌‌‌‌‌‌‌బర్గ్‌‌‌‌‌‌‌‌ కమోడిటీ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌ మంగళవారం పదేళ్ల గరిష్టాన్ని టచ్ చేసింది. మెటల్‌‌‌‌‌‌‌‌, ఎనర్జీ, ఫుడ్‌‌‌‌‌‌‌‌ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లకు డిమాండ్‌‌‌‌‌‌‌‌ పెరగడం, కరోనా దెబ్బతో ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్టేషన్‌‌‌‌‌‌‌‌ ఆగిపోవడంతో కమోడిటీ ధరలు పెరుగుతున్నాయి.   

హైదరాబాద్‌‌‌‌లో లీటర్ పెట్రోల్‌‌‌‌ రూ. 94.34
పెట్రోల్‌‌‌‌, డీజిల్‌‌‌‌ ధరలు వరసగా రెండో రోజూ పెరిగాయి. లీటర్ పెట్రోల్‌‌‌‌పై 19 పైసలు, డీజిల్‌‌‌‌పై 21 పైసలు పెంచుతూ ఆయిల్‌‌‌‌ మార్కెటింగ్‌‌‌‌ కంపెనీ(ఓఎంసీ) లు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశాయి. వివిధ రాష్ట్రాలలో ఎలక్షన్స్‌‌‌‌ ఉండడంతో 18 రోజుల పాటు ఓఎంసీలు ఆయిల్ ధరలలో మార్పులు చేయలేదు.  ఈ 18 రోజుల్లో వచ్చిన నష్టాలను కవర్ చేసుకోవడానికి ఓఎంసీలు తిరిగి పెట్రోల్, డీజిల్‌‌‌‌ ధరలను పెంచుతున్నాయని ఎనలిస్టులు పేర్కొన్నారు. తాజా రేట్ల పెంపుతో  ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.74 కు, డీజిల్‌‌‌‌ ధర రూ. 81.12 కు పెరిగాయి . అదే హైదరాబాద్‌‌‌‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.34 కు, డీజిల్‌‌‌‌ ధర రూ. 88.46 కు చేరుకున్నాయి. రాష్ట్రాలు విధించే ట్యాక్స్‌‌‌‌లు, లెవీల కారణంగా వివిధ రాష్ట్రాలలో పెట్రోల్‌‌‌‌, డీజిల్ ధరలు వేరు వేరుగా ఉంటాయి.