
న్యూఢిల్లీ: గ్లోబల్ ట్రెండ్స్, ఎకనామిక్ డేటా, కంపెనీల రిజల్ట్స్ ఈ వారం మార్కెట్ డైరెక్షన్‌ను నిర్ణయించనున్నాయి. ఈద్ ఉల్ ఫితర్ కారణంగా గురువారం మార్కెట్‌కు హాలిడే. ‘క్యూ4 రిజల్ట్స్‌ను ఇండియన్ కంపెనీలు ఈ వారం నుంచి ప్రకటించనున్నాయి. ఐటీ సర్వీసెస్ కంపెనీ టీసీఎస్ ఎర్నింగ్స్ సీజన్‌ను మొదలు పెట్టనుంది. ఈ కంపెనీ ఏప్రిల్ 12 న తన క్యూ4 రిజల్ట్స్‌ను ప్రకటించనుంది. దీంతో పాటు ఇండియా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా, మార్చికి గాను ఇన్‌ఫ్లేషన్ నెంబర్లు అదే రోజు వెలువడనున్నాయి’ అని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ ఎనలిస్ట్ సంతోష్ మీనా అన్నారు. గ్లోబల్‌గా చూస్తే, యూఎస్ కన్జూమర్ ఇన్‌ఫ్లేషన్ డేటా, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ పాలసీ నిర్ణయం కూడా ఈ వారమే విడుదల కానున్నాయి.