మార్కెట్‌‌‌‌ను నడిపేది గ్లోబల్ అంశాలే

మార్కెట్‌‌‌‌ను నడిపేది గ్లోబల్ అంశాలే

ముంబై: ఈ వారం మార్కెట్‌‌‌‌ డైరెక్షన్‌‌‌‌ను  గ్లోబల్ అంశాలు నిర్ణయించనున్నాయి. రిజల్ట్స్ సీజన్ ముగింపు దశకు చేరుకోవడంతో పాటు లోకల్‌‌‌‌గా ఎటువంటి పెద్ద ఈవెంట్‌‌‌‌లు లేకపోవడంతో గ్లోబల్ అంశాల ప్రభావం మార్కెట్లపై క్లియర్‌‌‌‌‌‌‌‌గా కనిపించనుంది. క్రూడ్‌‌‌‌ ఆయిల్ ధరలు, డాలర్ మారకంలో రూపాయి కదలికలు, యూఎస్ ఫెడ్ మినిట్స్‌‌‌‌పై ట్రేడర్లు దృష్టి పెట్టాలని ఎనలిస్టులు సలహా ఇచ్చారు. 

వోలటాలిలో కదిలిన బెంచ్‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌లు శుక్రవారం కన్సాలిడేషన్ రేంజ్‌‌‌‌ నుంచి బయటకు వచ్చాయని పేర్కొన్నారు. మాక్రో ఎకనామిక్ డేటా మెరుగ్గా ఉండడంతో  సెన్సెక్స్ కిందటి వారాన్ని 72,427 దగ్గర, నిఫ్టీ 22,041 దగ్గర ముగించాయి. రిటైల్‌‌‌‌ ఇన్‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌ జనవరిలో మూడు నెలల దిగువకు రావడం, ఫుడ్ ధరలు తగ్గడంతో మార్కెట్‌‌‌‌కు సపోర్ట్ దొరికింది. ‘బ్యాంకింగ్ షేర్లలో భారీగా కొనుగోళ్లు రావడంతో ప్రారంభంలో నష్టాల్లో కదిలిన బెంచ్‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌లు లాభాల్లో వారాన్ని ముగించాయి. ఇన్‌‌‌‌ఫ్లేషన్ అంచనాల కంటే తక్కువగా ఉండడంతో ఆసియాలోని ఇతర మార్కెట్లతో పోలిస్తే మన మార్కెట్లు స్ట్రాంగ్‌‌‌‌గా ఉన్నాయి’ అని ఎనలిస్టులు అన్నారు.