మోడీకి గ్లోబల్ గోల్ కీపర్ అవార్డ్

మోడీకి గ్లోబల్ గోల్ కీపర్ అవార్డ్

ప్రధాని నరేంద్ర మోడీకి మరో అరుదైన గౌరవం దక్కింది. స్వచ్ఛ భారత్ అభియాన్ కోసం మోడీకి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ “గ్లోబల్ గోల్ కీపర్” అవార్డును  ప్రదానం చేసింది. బిల్ గేట్స్  చేతుల మీదుగా మోడీ ఈ అవార్డ్ ను  అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ ఈ గొప్ప మిషన్ ను విజయవంతం చేసినందుకు  దేశ ప్రజలను ప్రశంసించారు. మహాత్మా గాంధీ 150 వ జయంతి సంవత్సరంలోనే ఈ పురస్కారం పొందడం తనకు వ్యక్తిగతంగా చాలా ముఖ్యమైనదన్నారు. ఈ అవార్డ్ ను 130 కోట్ల భారతీయులకు అంకితం చేస్తున్నానన్నారు. గత ఐదేళ్లలో దేశంలో 11 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించామని, ఇది రికార్డు అని అన్నారు మోడీ.