ఇంటర్తో హెచ్సీఎల్లో ఉద్యోగం

ఇంటర్తో హెచ్సీఎల్లో ఉద్యోగం
  • టెక్‌‌‌‌బీ ప్రోగ్రామ్​ప్రారంభం

హైదరాబాద్​, వెలుగు: గ్లోబల్​ టెక్నాలజీ కంపెనీ హెచ్​సీఎల్‌‌‌‌టెక్​, హైదరాబాద్‌‌‌‌లోని ఇంటర్​ స్టూడెంట్లకు తమ టెక్‌‌‌‌బీ ఎర్లీ కెరీర్​ ప్రోగ్రామ్‌‌‌‌ను అందిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్రోగ్రామ్​లో శిక్షణ, ఇంటర్న్‌‌‌‌షిప్​తో పాటు హెచ్‌‌‌‌సీఎల్‌‌‌‌లో పూర్తి స్థాయి ఉద్యోగం కూడా లభిస్తుందని తెలిపింది. స్టూడెంట్లు మొదట హెచ్‌‌‌‌సీఎల్​ కెరీర్​ ఆప్టిట్యూడ్​ టెస్ట్​ (సీఏటీ) లో అర్హత సాధించాలి.  తర్వాత ఇంటర్వ్యూ, కమ్యూనికేషన్​ టెస్ట్​ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. 

ఈ ప్రోగ్రామ్​ మొత్తం 12 నెలలు ఉంటుంది. దీనిలో చేరడానికి కొంత ఫీజు చెల్లించాలి.  శిక్షణ కాలంలో అభ్యర్థులకు నెలకు దాదాపు రూ. 10 వేల స్టైపెండ్​ లభిస్తుంది.  ప్రోగ్రామ్​ విజయవంతంగా పూర్తి చేసిన వారికి హెచ్‌‌‌‌సీఎల్​లో ఐటీ సర్వీసెస్​ అసోసియేట్​ వంటి పోస్టులలో ఉద్యోగం లభిస్తుంది. ఈ ఉద్యోగంలో వార్షిక జీతం రూ. 1.7 లక్షల నుంచి రూ. 2.2 లక్షల వరకు ఉంటుంది.

 ఈ ప్రోగ్రామ్‌‌‌‌లో చేరిన వారికి బిట్స్​ పిలానీ, ఎమిటీ యూనివర్సిటీ, శాస్త్ర యూనివర్సిటీ వంటి ప్రముఖ సంస్థల నుంచి గ్రాడ్యుయేషన్​ చేసే అవకాశం కల్పిస్తామని హెచ్​సీఎల్‌‌‌‌టెక్​ సీనియర్​ వైస్– ప్రెసిడెంట్​ సుబ్బరామన్ అన్నారు.