
కరోనా ఆంక్షల సడలింపు తర్వాత ప్రపంచ వ్యాప్తంగా మరణశిక్షలు విధింపు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్ దేశం 2017 నుంచి అత్యంత ఎక్కువ సంఖ్యలో మరణశిక్షలు విధించే దేశాల జాబితాలో టాప్ లో నిలిచిందని అంతర్జాతీయ సంస్థ ఆమ్నెస్టీ తెలిపింది. 2021లో 18 దేశాలలో మొత్తం కలిపి దాదాపు 579 మరణశిక్షలు విధించారని, ఇది 2020లో కన్నా 20శాతం ఎక్కువని రైట్స్ మానిటర్స్ పేర్కొంది. గడిచిన 4ఏళ్లలో ఇరాన్ 2020 సంవత్సరానికి గానూ 314లో 246మందికి మరణశిక్షలు అమలుచేశారని సమాచారం. సౌదీ అరేబియాలోనూ ఈ సంఖ్య 2020కి వచ్చేసరికి రెట్టింపు కాగా, మయన్మార్ లోనూ 90మందికి డెత్ పెనాల్టీ విధించినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా బంగ్లాదేశ్, ఇండియా, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈజిప్ట్, పాకిస్తాన్ లాంటి56 దేశాల్లో కలిపి కనీసం 2,052 మరణశిక్షలను న్యాయమూర్తులు విధించారని సమాచారం.