ఇన్​హేలర్లతోనూ గ్లోబల్ వార్మింగ్

ఇన్​హేలర్లతోనూ గ్లోబల్ వార్మింగ్

    మీటర్డ్​డోస్ ఇన్​హేలర్లలో గ్రీన్​హౌస్ గ్యాస్​లు

    ఎకో ఫ్రెండ్లీ డ్రై పౌడర్​తో చేసిన వాటిని వాడితే మంచిది

    కేంబ్రిడ్జి యూనివర్సిటీ స్టడీ

ఆస్తమా.. ఓ తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి. ఆయాసంతో మనిషికి ఊపిరి అందకుండా చేస్తుంది. దీని నుంచి తాత్కాలికంగా బయటపడేందుకు పేషెంట్లు ఎక్కువగా ఇన్​హేలర్స్ వాడుతుంటారు. అయితే ఇన్​హేలర్స్.. గ్లోబల్ వార్మింగ్​కు కారణమవుతున్నాయని బ్రిటన్​కు చెందిన రీసెర్చర్లు తాజాగా వెల్లడించారు. అవి గ్రీన్​హౌస్ వాయువులను రిలీజ్ చేస్తున్నాయని చెబుతున్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ‘గ్రీన్ ఇన్​హేలర్స్’ను వాడాలని సూచిస్తున్నారు.

ఆ గ్యాస్​ వల్లే..

ఇంగ్లాండ్​లోని నేషనల్ హెల్త్ సర్వీస్ సూచించిన వివిధ రకాల ‘ఇన్​హేలర్ మెడికేషన్స్’​పై కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన టీమ్ స్టడీ చేసింది. అవి ఎన్విరాన్​మెంట్​పై ఎలా ఎఫెక్ట్ చూపుతాయో పరిశీలించింది. ప్రతి పది మంది పేషెంట్లలో ఏడుగురు మీటర్డ్​డోస్ ఇన్​హేలర్లను వాడుతున్నట్లు గుర్తించింది. ఈ ఇన్​హేలర్లు గ్రీన్​హౌస్ వాయువులను విడుదల చేస్తాయని, ఇన్​హేలర్ల నుంచి మెడిసిన్ బయటికి వచ్చేందుకు ‘హైడ్రోఫ్లోరోఅల్కేన్’ అనే గ్యాస్​ వినియోగిస్తారని చెప్పింది. మీటర్డ్ డోస్ ఇన్​హేలర్ల నుంచే 4 శాతం గ్రీన్​హౌస్ గ్యాస్ విడుదలవుతోందని ఎక్స్​పర్టులు చెబుతున్నారు.

డ్రై పౌడర్ ఇన్ హేలర్లు వాడితే

ప్రతి 10 ఇన్​హేలర్లలో కనీసం ఒక్క దాన్ని రీప్లేస్ చేసి.. ఎన్విరాన్​మెంటల్ ఫ్రెండ్లీ డ్రై పౌడర్ ఇన్ హేలర్లను వాడితే కార్బన్​ డయాక్సైడ్ ఎమిషన్లను 58 కిలో టన్నుల వరకు తగ్గించవచ్చని రీసెర్చర్లు అంచనా వేశారు. ఇది లండన్ నుంచి ఎడిన్​బర్గ్ మధ్య లక్షా 80 వేల సార్లు తిరిగితే వెలువడే కాలుష్యంతో సమానం. మరోవైపు మీటర్డ్ డోస్ ఇన్​హేలర్ల అవసరం ఉన్న వాళ్లు వాటిని కొనసాగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొత్త వాటిని ఉపయోగించడం వల్ల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, డాక్టర్ల సూచనలతోనే వేర్వేరు మెడికేషన్స్​ను ఫాలో కావొచ్చని అంటున్నారు. ఇన్​హేలర్లను వాడిన తర్వాత సరైన రీతిలో డిస్పోజ్ చేయాలని,  ఖాళీ అయిన వాటిలో గ్రీన్ హౌస్ గ్యాస్​లు ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. వాటిని ఫార్మసీల్లో ఇవ్వాలంటున్నారు.