రూ.1,150 కోట్లు సేకరించిన హైదరాబాద్ ఎయిర్‌‌పోర్ట్‌

రూ.1,150 కోట్లు సేకరించిన హైదరాబాద్ ఎయిర్‌‌పోర్ట్‌

న్యూఢిల్లీ: జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్‌‌‌‌ఐఏఎల్‌‌‌‌)  రూ.1,150 కోట్లను  ఎన్‌‌‌‌సీడీల (నాన్ కన్వర్టబుల్‌‌‌‌ డిబెంచర్ల)  ద్వారా సేకరించింది. ఎన్‌‌‌‌సీడీల (బాండ్ల) ను షేర్లుగా మార్చుకోవడానికి వీలుండదు. ఈ ఎన్‌‌‌‌సీడీలు త్వరలో బీఎస్‌‌‌‌ఈలో లిస్ట్ అవుతాయని కంపెనీ ఓ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌లో పేర్కొంది. 10 ఏళ్ల మెచ్యూరిటీతో వీటిని ఇష్యూ చేశారు. మొదటి ఐదేళ్లకు గాను ఏడాదికి 8.805 శాతం వడ్డీ రేటు దగ్గర  ఎన్‌‌‌‌సీడీలను  జీహెచ్‌‌‌‌ఐఏఎల్ ఇష్యూ చేసింది. 

వడ్డీ చెల్లింపులను ప్రతి మూడు నెలలకు ఒకసారి చేస్తుంది. మొదటి ఐదేళ్లు పూర్తయ్యాక తర్వాత ఐదేళ్ల కోసం వడ్డీ రేటును ఫిక్స్ చేస్తామని కంపెనీ ప్రకటించింది. ఈ ఇష్యూని ప్రైవేట్ ప్లేస్‌‌‌‌మెంట్ విధానంలో తీసుకొచ్చారు. అందువలన అర్హత కలిగిన క్వాలిఫైడ్ ఇన్‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు వీటి కోసం సబ్‌‌‌‌స్క్రయిబ్ అయ్యారని  కంపెనీ పేర్కొంది. ఇప్పటికే తీసుకున్న అప్పులకు రిఫైనాన్సింగ్​ చేయడానికి ఈ ఫండ్స్‌‌‌‌లో కొంత వాటాను వాడతారు.