పణజి: రోడ్డు పక్కన చెత్త వేస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్ కావడం, నెటిజన్ల ట్రోలింగ్‌తో మనస్తాపానికి గురైన ఓ 23 ఏళ్ల కాలేజీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం గోవాలోని మాపుసా ప్రాంతంలో ఈ విషాదం చోటుచేసుకుంది. డిగ్రీ చదువుతున్న శామ్యూల్ డి బ్రగాంజా.. తల్లి, ఇద్దరు సోదరిలతో కలిసి నివసిస్తున్నాడు. ఇటీవల అతడు రోడ్డు పక్కన చెత్త వేస్తుండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వీడియో ఆధారంగా స్థానిక పోలీసులు శామ్యూల్‌పై కేసు పెట్టి, విచారణకు రమ్మంటూ నోటీసులు జారీ చేశారు. అతడు స్టేషన్‌కు వెళ్లి విచారణకు సహకరించాడు. అయితే నెట్టింట సాగుతున్న ట్రోలింగ్, విమర్శల కారణంగా అతడు మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. ఇంట్లోని లైసెన్స్డ్ తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు.
