గోవాలో వైభవంగా దీపావళి వేడుకలు

గోవాలో వైభవంగా దీపావళి వేడుకలు

గోవా ప్రజలు దీపావళిని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ ఉత్సవాల్లో భాగంగా నరకాసురుని దిష్టిబొమ్మను దహనం చేస్తారు. ఇది చెడుపై మంచి సాధించిన విజయంగా అక్కడి ప్రజలు భావిస్తారు. అయితే గోవాలో దివాళి అనగానే కొన్ని వారాల ముందు నుంచే సందడి మొదలవుతుంది. అక్కడి సంప్రదాయం ప్రకారం నరకాసురుడి దిష్టిబొమ్మను దహనం చేస్తారు. దీపావళి ముందు రోజు నరక చతుర్దశి సందర్భంగా దహనం తర్వాత టపాకాయలు పేలుస్తూ ఘనంగా జరుపుకుంటారు. 

ఈ దహనానికి ఉపయోగించే నరకాసుడి దిష్టిబొమ్మ గడ్డి, కాగితం వంటి ఇతర పదార్థాలతో తయారు చేస్తారు. గోవాలోని కొందరు బృందంగా ఏర్పడి నరకాసుర పోటీలను నిర్వహించడం ఇక్కడ చెప్పుకోదగిన విషయం. పోటీల్లో పాల్గొన్న వారికి బహుమతులు కూడా నిర్వాహకులు ప్రదానం చేస్తారు. అయితే ఈ నరకాసుర దహనం సమయంలో ప్రజలు డ్రమ్స్ వాయిస్తూ సందడి చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇవి ముంబయిలో నిర్వహించే గణేష్ ఉత్సవాలను తలపిస్తాయి.