ఫోగట్ హఠాన్మరణంపై హత్య కేసు

ఫోగట్ హఠాన్మరణంపై హత్య కేసు

పణజి: బీజేపీ లీడర్​ సోనాలి ఫోగట్(42) హఠాన్మరణంపై గోవా పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. గుండెపోటుతో చనిపోయినట్టుగా భావించి తొలుత అనుమానాస్పద మరణంగా కేసు పెట్టారు. అయితే షూటింగ్ ఉందని గోవా తీసుకెళ్లి సహాయకులే ఆమెను హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బుధవారం సోనాలి సోదరుడు రింకూ ధాకా గోవా వెళ్లి ఫిర్యాదు చేయడంతో సోనాలి సహాయకులు సుధీర్ సగ్వాన్​, సుఖ్వీందర్​ వాసీలపై ఐపీసీ సెక్షన్​302 కింద మర్డర్​కేసు నమోదు చేశారు.

కేసును గోవా డీజీపీ జస్పాల్ సింగ్ పర్సనల్​గా పర్యవేక్షిస్తారని గోవా సీఎం ప్రమోద్  సావంత్ పేర్కొన్నారు. జస్పాల్ ​సింగ్ గురువారం పణజిలో కేసు వివరాలు, దర్యాప్తు కొనసాగుతున్న తీరును మీడియాకు వెల్లడించారు. సోనాలి మృతదేహానికి పోస్ట్​మార్టం నిర్వహించామని, అటాప్సీ రిపోర్టు వచ్చిన తర్వాత ఆమె ఎలా చనిపోయారనే దానిపై స్పష్టత వస్తుందని చెప్పారు.