కలనగుటే నియోజకవర్గం నుంచి మైఖేల్ లోబో పోటీ

కలనగుటే నియోజకవర్గం నుంచి మైఖేల్ లోబో పోటీ

గోవాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. టికెట్ల కేటాయింపులో ఆయా పార్టీల నేతలు తర్జనభర్జన పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ అయిన మైఖేల్ లోబో కలనగుటే నియోజకవర్గాన్ని  కేటాయించింది. ఆయన కలంగుటే నుంచే పోటీచేయనున్నారు. సీఎం ప్రమోద్ సావంత్ హయాంలో మంత్రిగా పనిచేశారు మైఖేల్ లోబో. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ కు వారం రోజుల ముందు బీజేపీ వీడి హస్తం పార్టీలో జాయిన్ అయ్యారు. ఉత్తర గోవా నుంచి బలమైన నేతగా పేరున్న మైఖేల్ లోబో..బీజేపీ ప్రభుత్వంలో సైన్స్, టెక్నాలజీ మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ లో జాయిన్ అవుతూ  లోబో బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ సామాన్యుడి సంక్షేమాన్ని కాంక్షించే పార్టీ కాదని ఆరోపించారు. కాంగ్రెస్ సామాన్య ప్రజల కోసం పనిచేస్తుందని చెప్పారు. గోవాలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 25 కంటే ఎక్కువ సీట్లు సాధించి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గోవాలో ఫిబ్రవరి 14న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి. 

READ MORE

25 మంది క్రిమినల్స్ కు బీజేపీ టికెట్