భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జోరుగా కురుస్తున్న వర్షాలకు భద్రాచలంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరిలో ఫ్లడ్ అంతకంతకు పెరుగుతుండటంతో... నీటిమట్టం 43 అడుగులకు చేరింది. దీంతో ఇరిగేషన్ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
గోదావరి పరివాహకంలోని లోతట్టు ప్రాంతాల వాసులు అలర్ట్ గా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వరద ఎఫెక్ట్ తో సహాయక చర్యలపై ఫోకస్ పెట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.