రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం : ఎమ్మెల్యే రాందాస్ నాయక్

రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం : ఎమ్మెల్యే రాందాస్ నాయక్
  • వైరా ఎమ్మెల్యే రాందాస్​ నాయక్​

జూలూరుపాడు, వెలుగు: గోదావరి జలాలను జూలూరుపాడు, ఏన్కూర్, మండల రైతులతో పాటు వైరా రిజర్వాయర్​కు తరలించి మాట నిలబెట్టుకుంటున్నామని  వైరా ఎమ్మెల్యే రాందాస్​ నాయక్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని వినోభానగర్​ రాజీవ్​ కెనాల్​ వద్ద పూజలు చేసి గేట్లు ఎత్తి  వైరా రిజర్వాయర్‌‌కు నీటిని వదిలారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  వైరా నియోజకవర్గంలోని మూడు మండలాల రైతులకు మేలు చేకూర్చే విధంగా కాలువ డిజైన్​ చేయించామన్నారు. 1600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామన్నారు. 

రానున్న రోజుల్లో జూలూరుపాడు, ఏన్కూరు మండలాలకు సుమారు 35 వేల ఎకరాలకు,  వైరా రిజర్వాయర్​ నుంచి కొణిజర్ల మండలాలకు సుమారు 25 వేల ఎకరాలకు  పిల్ల కాలువల ద్వారా సాగు నీటిని అందిస్తామన్నారు. గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లా కాంగ్రెస్  పార్టీ అధ్యక్షుడు పువాళ్ళ దుర్గాప్రసాద్, జిల్లా నాయకులు రాజశేఖర్​, లేళ్ళ వెంకటరెడ్డి, మండల అధ్యక్షుడు మంగీలాల్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.