మొక్కజొన్న పంట కోసం అషితాకా.. హెర్బిసైడ్ను తీసుకొచ్చిన గోద్రెజ్ ఆగ్రోవెట్

మొక్కజొన్న పంట కోసం అషితాకా.. హెర్బిసైడ్ను తీసుకొచ్చిన గోద్రెజ్ ఆగ్రోవెట్

హైదరాబాద్​, వెలుగు: గోద్రెజ్ ఆగ్రోవెట్  మొక్కజొన్న  పంట  కోసం కొత్త హెర్బిసైడ్ 'అషితాకా'ను ప్రారంభించింది.  ఈ కొత్త ఉత్పత్తిని జపాన్​ కంపెనీ ఐఎస్​కే  సహకారంతో అభివృద్ధి చేశారు. ఇది గడ్డి,  కలుపు మొక్కలను తొలగిస్తుంది. తెలంగాణలో ఇది అక్టోబరు నుంచి అందుబాటులో ఉంటుందని హైదరాబాద్​లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో గోద్రెజ్ ఆగ్రోవెట్ సీఈవో (క్రాప్ ప్రొటెక్షన్) రాజావేలు  తెలిపారు. 

50 మిల్లీలీటర్ల అషితాకా బాటిల్​ధర రూ.1,800 అని, ఇది  ఎకరానికి సరిపోతుందని తెలిపారు.  కలుపు మొక్కలు 2–-4 ఆకుల దశలో ఉన్నప్పుడు ఈ హెర్బిసైడ్‌‌‌‌‌‌‌‌  బాగా పనిచేస్తుందన్నారు. తెలంగాణలో తమకు ఆరు వేల వరకు రిటైలర్లు ఉన్నారని, ఈ రబీ సీజన్​లో లక్ష ఎకరాలకు దీనిని సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.