పురుగుల బెడద నుంచి రక్షణకు గోద్రెజ్ ఆగ్రోవెట్ గ్రేసియా

పురుగుల బెడద నుంచి రక్షణకు గోద్రెజ్ ఆగ్రోవెట్ గ్రేసియా

హైదరాబాద్, వెలుగు: మొక్కలను పురుగుల బెడద నుంచి రక్షించడానికి గోద్రెజ్ ఆగ్రోవెట్ గ్రేసియా పేరుతో  కీటకనాశకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇది పంటలను కీటకాల నుండి రక్షించడానికి ఉపయోగపడుతుంది. గ్రేసియాలో ఫ్లక్సామైడ్ పదార్థం ఉంటుంది. ఇది పీల్చే కీటకాలను చంపడానికి సహాయపడుతుంది. 

గ్రేసియా తో శుద్ధి చేసిన మొలకలు ఆరోగ్యంగా ఉంటాయని,  నర్సరీ యజమానులకు ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొంది.   సరైన సమయంలో  సరైన పరిమాణంలో గ్రేసియాను వినియోగించడం ద్వారా, నర్సరీ యజమానులు మిరప, వరి రైతులు ఎంతో లాభం పొందవచ్చని ప్రకటించింది.  మిరప పంటలకు ప్రధాన ముప్పు యిన తామర పురుగు,  గొంగళి పురుగులను సమర్థవంతంగా నియంత్రిస్తుందని తెలిపింది.