ఈ సూపర్ ఫ్రూట్ తింటే.. వందేళ్లు బతకడం పక్కా..

ఈ సూపర్ ఫ్రూట్ తింటే.. వందేళ్లు బతకడం పక్కా..

గోజి బెర్రీ ... చూడ్డానికి ఎర్రగా.. ద్రాక్ష సైజులో ఉంటుంది. టిబెట్, నేపాల్, వెస్ట్ చైనాలలో ఎక్కువగా దొరికే ఈ ఫ్రూట్ ఇప్పుడు మన దగ్గరా కనిపిస్తోంది. దీనివల్ల లాభాలేంటి? అంటారా. ఈ పండులో ఇమ్యూనిటీని పెంచే యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు అమైనో యాసిడ్స్, మినరల్స్ ఎక్కువ ఉన్నాయి అంటున్నాయి స్టడీలు. ఈ పండుకి రెండువేల ఏళ్లనాటి చరిత్ర ఉందనేది కొన్ని రీసెర్చర్ల మాట. అసలు ఈ పండు కథేంటంటే. 

వోల్ఫ్ బెర్రీగానూ పేరున్న ఈ ఫ్రూట్ ని రెండువేల సంవత్సరాల కిందట చైనాలో గుర్తించారట. అప్పట్లో చైనాలోని ఒక ఊరికెళ్లిన డాక్టర్ అక్కడి జనాలంతా వందేళ్ల పైన బతకడం చూసి ఆశ్చర్యపోయాడట. దానిపైన రీసెర్చ్ చేస్తుంటే ఆ ఊరి బావి చుట్టూ గోజి బెర్రీ మొక్కలు కనిపించాయట. ఆ చెట్టు పండ్లు బావిలో పడి, వాటిలో ఉండే పోషకాలన్నీ నీళ్లలోకి చేరాయట.

అవి తాగడం వల్ల వాళ్లు వందేండ్లు దాటినా ఆరోగ్యంగా ఉన్నారని తేలింది. దాంతో అప్పట్నించీ చైనా వాళ్లు ఈ చెట్టు ఆకులు, కొమ్మల్ని కూడా వంటల్లో కలిపేశారు. ఆ తరువాత గోజి బెర్రీ సూపర్ ఫ్రూట్ అన్ని దేశాలకి పరిచయం అయింది. మన దగ్గర ఇవి బాగానే దొరుకుతున్నాయి. ఇవి తినడం వల్ల లాభాలేంటంటే... 

* గోజి బెర్రీలో వయసు ఛాయలు కనిపించకుండా చేసే న్యూట్రియెంట్స్, విటమిన్స్ ఎక్కువ. ఈ పండు ఇమ్యూనిటీ బూస్టర్ కూడా. అలాగే స్కిన్, బ్రెస్ట్ క్యాన్సర్స్ తో పాటు గుండె సంబంధిత సమస్యల్ని దరిచేరనివ్వదు. 

* ఈ పండులోని విటమిన్-ఎ, సి, జియాగ్జాంతిన్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కంటిచూపుని మెరుగుపరుస్తాయి. వీటిల్లోని కెరటిన్ పొడిబారిన చర్మాన్ని రీఫ్రెష్ చేస్తుంది. అందుకే మాయిశ్చరైజర్లు, క్రీములు, సబ్బుల తయారీలోనూ ఈ పండునే వాడతారు. 

•  గోజి బెర్రీ కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేస్తుంది. కార్డియోవాస్క్యులర్ డిసీజ్ ల నుంచి కాపాడుతుంది. తక్కువ క్యాలరీలు, ఎక్కువ న్యూట్రియెంట్స్ ఉన్న ఈ ఫ్రూట్ తింటే బరువు తగ్గొచ్చు అంటున్నారు కూడా.

*  వంద గ్రాముల గోజి బెర్రీల్లో ఐరన్ - 9 మి.గ్రా, రిబోఫ్లేవిన్- 1.3 మి.గ్రా, క్యాల్షియం - 150 మి.గ్రా, సెలీనియం - 50 మి.గ్రా, పొటాషియం, 1,132 మి.గ్రా, జింక్ -2 మి.గ్రా ఉంటాయి. ఈ పండు తినడం వల్ల వీటితో పాటు పదకొండు రకాల మినరల్స్, 18 రకాల అమైనో యాసిడ్స్ శరీరానికి అందుతాయి. 

•  వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ ట్యూమర్స్ ని దరిచేరనివ్వవు. ఈ పండు తింటే పాలిసాకరైడ్స్ సరిపడా అంది గ్లూకోజ్ లెవల్స్ అదుపులో ఉంటాయి. దానివల్ల డయాబెటిస్ రాదు. పాలిసాకరైడ్స్ ఇమ్యూనిటీ బూస్టర్ కూడా పనిచేసి జలుబు, ఫ్లూల నుంచి కాపాడతాయి.