
హైదరాబాద్ కోఠిలో ఉన్న ప్రముఖ గోకుల్ చాట్ యజమాని ముకుంద్ దాస్ (75) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కాచిగూడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 22 గురువారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు వెల్లడించారు.
ముకుంద్‌దాస్ మృతితో కోఠి, సుల్తాన్‌బజార్‌లో విషాదం నెలకొంది. ఇమ్లిబన్ హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. 1966లో ముకుంద్ దాస్ గోకుల్ చాట్ పేరిట చాట్ భండార్ ఏర్పాటు చేశారు. 2007 ఆగస్టు 25వ తేదీన ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ పేలుడులో 33 మంది మరణించారు.