
Gold Price Today: బంగారం, వెండి రేట్లు చిన్న బ్రేక్ కూడా తీసుకోకుండా వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో రిటైల్ మార్కెట్లలో గోల్డ్ అండ్ సిల్వర్ ఎప్పుడూ కని విని ఎరుగని రేట్లకు పెరిగాయి. దసరా నవరాత్రుల్లో షాపింగ్ చేద్దాం అనుకుంటున్న తెలుగు ఫ్యామిలీలు అమాంతం పెరుగుతున్న రేట్లను చూసి అవాక్ అవుతున్నారు. ఇలా అయితే ఇక భవిష్యత్తులో గ్రాము కూడా బంగారం కొనగమనా అంటూ రేట్లు చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలే బంగారం బులిష్ జోరుకు కారణంగా నిపుణులు చెబుతున్న వేళ పెరిగిన ధరలను ప్రస్తుతం గమనించండి..
24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే సెప్టెంబర్ 22తో పోల్చితే 10 గ్రాములకు సెప్టెంబర్ 23న రూ.1260 పెరిగింది. అంటే గ్రాముకు రేటు రూ.126 పెరగటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ రేట్లు ఇలా భగ్గుమంటున్నాయి..
24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(సెప్టెంబర్ 23న):
హైదరాదాబాదులో రూ.11వేల 433
కరీంనగర్ లో రూ.11వేల 433
ఖమ్మంలో రూ.11వేల 433
నిజామాబాద్ లో రూ.11వేల 433
విజయవాడలో రూ.11వేల 433
కడపలో రూ.11వేల 433
విశాఖలో రూ.11వేల 433
నెల్లూరు రూ.11వేల 433
తిరుపతిలో రూ.11వేల 433
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు సెప్టెంబర్ 22తో పోల్చితే ఇవాళ అంటే సెప్టెంబర్ 23న 10 గ్రాములకు రూ.1150 పెరుగుదలను చూసింది. దీంతో మంగళవారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే..
22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(సెప్టెంబర్ 23న):
హైదరాదాబాదులో రూ.10వేల 480
కరీంనగర్ లో రూ.10వేల 480
ఖమ్మంలో రూ.10వేల 480
నిజామాబాద్ లో రూ.10వేల 480
విజయవాడలో రూ.10వేల 480
కడపలో రూ.10వేల 480
విశాఖలో రూ.10వేల 480
నెల్లూరు రూ.10వేల 480
తిరుపతిలో రూ.10వేల 480
బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా తమ ర్యాలీని వారం ప్రారంభంలో కొనసాగిస్తోంది. సెప్టెంబర్ 23న కేజీకి వెండి సెప్టెంబర్ 22తో పోల్చితే రూ.వెయ్యి పెరగటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.లక్ష 49వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.149 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.