బడ్జెట్ తర్వాత పెరిగిన బంగారం, వెండి ధరలు

బడ్జెట్ తర్వాత పెరిగిన బంగారం, వెండి ధరలు

దేశంలో మళ్లీ బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఫిబ్రవరి 1వ తేదీ గురువారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో మద్యంతర బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. కస్టమ్స్ పన్ను..ఎగుమతులు, దిగుమతుల పన్నులపై కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఎటువంటి మార్పు చేయలేదు. అయినా.. బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.  తాజాగా పెరిగిన ధరలతో ఫిబ్రవరి 2వ తేదీ శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.150 పెరిగి..  రూ.58,300గా ఉంది. ఇక,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై కూడా రూ.160 పెరిగింది. దీంతో  24 క్యారెట్ల తులం ధర రూ.63,600కు చేరుకుంది. కిలో వెండి ధరపై 200 రూపాయలు పెరిగి.. రూ.76,5000గా ఉంది. ఆంధ్రప్రదేశ్ విజయవాడలోనూ బంగారం, వెండి ధరలు ఇదే విధంగా ఉన్నాయి.  

దేశ రాజధాని  ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం  ధర రూ.58,450గా ఉండగా,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,750గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధరపై రూ.200 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.76,500గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం  ధర రూ.58,300గా ఉండగా..  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,600గా ఉంది. కిలో వెండి ధర రూ.76,500గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం  ధర రూ.58,900గా ఉండగా..  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,250కి చేరుకుంది. కిలో వెండి ధర రూ.78,000గా ఉంది.