తగ్గిన బంగారం ధరలు... పెరిగిన వెండి.. హైదరాబాద్లో తాజా రేట్లు ఇవే..

తగ్గిన బంగారం ధరలు... పెరిగిన వెండి.. హైదరాబాద్లో తాజా రేట్లు ఇవే..

బంగారం, వెండి ధరలు శుక్రవారం(నవంబర్ 24) స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల బంగారం (22క్యారెట్లు) ధర రూ. 50 దిగొచ్చి.. రూ. 56,800కి చేరింది. గురువారం(నవంబర్ 23) ఈ ధర రూ. 56,850గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 500 తగ్గి, రూ. 5,68,000కి చేరింది. 1 గ్రామ్​గోల్డ్ ధర ప్రస్తుతం 5,680గా ఉంది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10 గ్రాములు) ధర రూ. 50 తగ్గి.. రూ. 61,970కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 62,020గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 500 దిగొచ్చి.. రూ. 6,19,700గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 6,197గా ఉంది.

హైదరాబాద్​లో గోల్డ్ రేట్..

హైదరాబాద్​లో శుక్రవారం(నవంబర్ 24) 22 క్యారెట్ల గోల్డ్​ధర రూ. 56,800గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,970గా నమోదైంది. ఇక విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. అదేవిధంగా విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో బంగారం రేట్లు శుక్రవారం(నవంబర్ 25) తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 56,950గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,120గా ఉంది. కోల్​కతాలో ఈరోజు 22 క్యారెట్ల పసిడి ధర రూ. 56,800 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 61,970గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళల్లో కూడా ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

వెండి ధరలు ఇలా..

వెండి ధరల విషయానికి వస్తే.. దేశంలో వెండి ధరలు పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,620గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 200 పెరిగి.. రూ. 76,200కి చేరింది. గురువారం(నవంబర్ 23) ఈ ధర రూ. 76,000గా ఉండేది. కాగా..

హైదరాబాద్ లో కేజీ వెండి ధర రూ. 79,200 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 76,200.. బెంగళూరులో రూ. 75,000గా ఉంది.

Also Read :- తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు..వెల్లడించిన వాతావరణ శాఖ