బంగారం, వెండి ధరలు పెరిగాయి. గత 10 రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు.. 2026, జూన్ 12వ తేదీన పెరగటం మొదలుపెట్టింది. ఇరాన్ పై అమెరికా యుద్ధానికి సంబంధించి క్లారిటీ రావటం.. చర్చలకు ఇరాన్ దేశం ఓకే చెప్పటంతో మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నాయి. యుద్ధం ముగిసింది అనే ఆలోచనలో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపించటంతో బంగారం, వెండి ధరలు పెరిగాయి.
జూన్ 12వ తేదీ ధరలు ఇలా ఉన్నాయి :
24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 300 రూపాయలు పెరిగింది. దీంతో తులం బంగారం లక్షా 48 వేల 580 రూపాయలుగా ఉంది.
అదే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 270 రూపాయలు పెరిగింది. దీంతో తులం బంగారం లక్షా 36 వేల 200 రూపాయలుగా ఉంది.
అదే 18 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 221 రూపాయలు పెరిగింది. దీంతో తులం బంగారం లక్షా 11 వేల 440 రూపాయలుగా ఉంది.
వెండి ధరల విషయానికి వస్తే..
ధరలు భగ్గుమన్నాయి. కేజీ వెండి ఒక్క రోజునే 5 వేల రూపాయలు పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో కేజీ వెండి 2 లక్షల 65 వేల రూపాయలకు చేరింది.
ఇక ప్లాటినమ్ విషయానికి వస్తే బంగారం, వెండి బాటలోభారీగా పెరిగింది ప్లాటినం ధర. 10 గ్రాములకు 2 వేల 100 రూపాయిలు పెరిగింది. దీంతో 12వ తేదీన 10 గ్రాముల ప్లాటినం ధర 53 వేల 160 రూపాయలుగా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లు పాజిటివ్ గా ఉండటంతో.. బంగారం, వెండి, ప్లాటినమ్ ధరలు భారీగా పెరిగాయి. ఇదే విధంగా కొనసాగుతాయా లేక మళ్లీ ధరలు పడతాయా అనేది వేచి చూడాలి.
