Adarsha Kutumbam: 'ఎప్పుడో పెళ్లప్పుడు నవ్వింది'.. వెంకీ కామెడీ టైమింగ్‌తో 'AK47' నుంచి శ్రీనిధి శెట్టి గ్లింప్స్ రిలీజ్!

Adarsha Kutumbam: 'ఎప్పుడో పెళ్లప్పుడు నవ్వింది'..  వెంకీ కామెడీ టైమింగ్‌తో 'AK47' నుంచి శ్రీనిధి శెట్టి గ్లింప్స్ రిలీజ్!

విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ' ఆదర్శ కుటుంబం: హౌస్ నెం.47  (AK47).  రోజురోజుకూ ఈ మూవీపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. వరుస ప్రమోషనల్ కంటెంట్ ను రిలీజ్ చేస్తూ అభిమాలను మరింత ఎగ్జైట్ చేస్తున్నారు. నిన్న ( జూలై 27, 2026 ) వెంకటేష్ క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ చిట్టిబాబు గ్లింప్స్ రిలీజ్ చేశారు. లేటెస్ట్ గా మరో గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.

 గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2, 2026న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడప్ చేశారు. లేటెస్ట్ గా ( జూలై 28, 2026 )  హీరోయిన్ శ్రీనిధి శెట్టి పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో వెంకటేశ్‌కు భార్యగా 'స్వర్ణ'పాత్రలో శ్రీనిధి కనిపించనుండగా.. "ఎప్పుడో పెళ్లప్పుడు నవ్వింది.. మళ్లీ ఇప్పటి వరకూ నవ్వలేదు" అంటూ వెంకీ చెప్పే డైలాగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. త్రివిక్రమ్ మార్క్ హ్యూమర్, వెంకటేశ్ టైమింగ్ మరోసారి మ్యాజిక్ చేయబోతున్నాయనే సంకేతాలు ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇప్పటికే రిలీజైన 'చిట్టిబాబు' క్యారెక్టర్ గ్లింప్స్ కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. కుటుంబ బంధాలు, సరదా సంభాషణలు, ఎమోషన్స్, కామెడీని సమపాళ్లలో మేళవిస్తూ త్రివిక్రమ్ మరోసారి తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నటి నివేదా పేతురాజ్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్లు గ్లింప్స్ ద్వారా హింట్ ఇచ్చారు.

ఈ మూవీలో రావు రమేష్, యువినా, రాజ్ ప్రజ్వల్, సత్య, బ్రహ్మాజీ, ఉదయ్ బీర్ సంధు, రఘుబాబు, వెన్నెల కీషోర్ కీలక పాత్రలో నటిస్తున్నారు.  ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని  హారికా, హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రతి అప్‌డేట్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.  ఇదే స్థాయిలో సినిమా కూడా అలరిస్తే వెంకటేశ్-త్రివిక్రమ్ కాంబో నుంచి మరో వింటేజ్ బ్లాక్‌బస్టర్ రావడం ఖాయమనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.