Allu Arjun: బన్నీ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. హీరోయిన్, సాంగ్స్ లేకుండానే ‘AA23’.. అసలు లోకేష్ ప్లాన్ ఏంటి ?

Allu Arjun: బన్నీ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. హీరోయిన్, సాంగ్స్ లేకుండానే ‘AA23’.. అసలు లోకేష్ ప్లాన్ ఏంటి ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘AA23’. ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ లతో సినీ వర్గాల్లో మోత మోగిస్తోంది. సంక్రాంతి కానుకగా మైత్రీ మూవీ మేకర్స్ నుంచి వచ్చిన సినిమా అనౌన్స్‌మెంట్ టీజర్‌ చూసే ఉంటారుగా.. అప్పట్లో ఈ టీజర్లో చూపించిన ఎలిమెంట్స్ ఎంత ఆసక్తి రేపాయో.. అనిరుధ్ ఇచ్చిన థీమ్ సాంగ్ అంతే విధంగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే ‘AA23’లో సాంగ్స్ ఏ రేంజ్లో ఉంటాయో ఓ ఐడియా వచ్చేసింది ఐకాన్ ఫ్యాన్స్కు. అయితే, లేటెస్ట్గా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అది అభిమానులకు గుడ్ న్యూస్ అవుతుందా? లేక నిరాశ కలిగించే విషయమా? అనే చర్చ సాగుతోంది. మరి ఆ క్రేజీ అప్డేట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

LCUతో కనెక్షన్..

లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘AA23’పై ఆసక్తికర చర్చ సాగుతోంది. కమర్షియల్ ఫార్ములాలకు దూరంగా, డార్క్ అండ్ రా యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని లోకేష్ రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ కథకు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)తో కూడా కనెక్షన్ ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. 

‘AA23’లో హీరోయిన్ ఉండదా? 

అల్లు అర్జున్-లోకేష్ ‘AA23’పై ఆసక్తికరమైన ప్రచారం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో హీరోయిన్ పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదని, అసలు మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్‌నే లేకుండా కథను రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కథకు అవసరం లేని కమర్షియల్ అంశాలు, పాటలు లేదా బలవంతంగా హీరోయిన్ పాత్రను చేర్చే ఆలోచన లోకేష్‌కు లేదని తెలుస్తోంది. అందుకే కథను ముందుకు నడిపించే పాత్రలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం.

గతంలో ‘ఖైదీ’, ‘విక్రమ్’చిత్రాల్లో కూడా హీరోయిన్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా కథ, యాక్షన్‌పైనే లోకేష్ దృష్టి పెట్టారు. అదే ఫార్మాట్‌ను ‘AA23’లోనూ కొనసాగించనున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. కొద్ది రోజులుగా ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించనున్నారనే వార్తలు వినిపించినప్పటికీ, ఈ లేటెస్ట్ అప్డేట్ వాటికి భిన్నంగా ఉంది. అయితే, ‘AA23’ మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.  ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ తెరకెక్కిస్తున్న 'రాకా' చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా షెడ్యూల్ పూర్తైన తర్వాత ‘AA23’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.

బన్నీ ఫ్యాన్స్‌కు షాక్ ఇస్తున్న లేటెస్ట్ టాక్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా అంటే అభిమానులకు ముందుగా గుర్తొచ్చేది ఆయన స్టైలిష్ డ్యాన్స్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, హుషారైన పాటలు. ముఖ్యంగా బన్నీ సినిమాల్లో సాంగ్స్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అలాంటి అల్లు అర్జున్-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘AA23’లో మాత్రం పాటలకు పెద్దగా ప్రాధాన్యం ఉండకపోవచ్చనే వార్త బన్నీ ఫ్యాన్స్‌కు షాక్ ఇస్తుంది. 

ALSO READ : Ram Charan Surgery: రామ్ చరణ్‌కు సర్జరీ సక్సెస్..

లోకేష్ కనగరాజ్ తన సినిమాలను పూర్తిగా కథ, స్క్రీన్‌ప్లే, యాక్షన్ ఎలిమెంట్స్ చుట్టూ నడిపించే దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘ఖైదీ’, ‘విక్రమ్’ వంటి చిత్రాల్లో కూడా ఆయన కమర్షియల్ అంశాల కంటే కథకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అదే తరహాలో ‘AA23’ను కూడా డార్క్ అండ్ రా యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కథ ఫ్లోకు ఆటంకం కలగకుండా ఉండేందుకు పాటలు, అనవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్‌ను తగ్గించాలని లోకేష్ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే అల్లు అర్జున్ అంటేనే డ్యాన్స్, సాంగ్స్‌ను ఇష్టపడే అభిమానులకు ఇది కొంత నిరాశ కలిగించే అంశంగా మారొచ్చు.

అయితే బన్నీ స్క్రీన్ ప్రెజెన్స్, స్టైల్, మాస్ ఎలివేషన్స్‌కు లోకేష్ ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. పాటలు లేకపోయినా, బన్నీ పాత్రను పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసి అభిమానులను మెప్పించేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో పూర్తి క్లారిటీ సినిమా సెట్స్‌పైకి వెళ్లిన తర్వాతే రానుంది.