యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన.. ఒక్కసారిగా తగ్గిన గోల్డ్.. తెలంగాణలో రేట్లు ఇవే..

యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన.. ఒక్కసారిగా తగ్గిన గోల్డ్.. తెలంగాణలో రేట్లు ఇవే..

తనకు యుద్ధం కొనసాగించే ఇష్టం లేదంటూ మెున్నటి వరకూ చెప్పిన ట్రంప్ ఇవాళ మాట మార్చేశారు. ఇరాన్ అంతు తేలుస్తామని.. ఈ వారం దాడులు తీవ్రతరం చేస్తామంటూ ట్రంప్ చెప్పటంతో గోల్డ్, సిల్వర్ రేట్లు మళ్లీ నేలచూపులు చూడటం స్టార్ట్ చేశాయి. అమెరికాకు ఇరాన్ కొరకరాని కొయ్యలా మారిపోవటంతో ఇన్వెస్టర్లలో కూడా గందరగోళమే కొనసాగుతోంది. ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తగ్గిన రేట్లను పరిశీలించండి.

ఏప్రిల్2న బంగారం రేట్లు స్వల్పంగా తగ్గాయి. ఏప్రిల్1 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.153 తగ్గుదలను నమోదు చేసింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 142గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 880గా కొనసాగుతోంది. 

గురువారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఏప్రిల్ 2, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు తగ్గింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు స్థిరంగా రూ.2లక్షల 55వేల వద్ద కొనసాగుతోంది. అంటే గ్రాము ధర రూ.255గా ఉంది.