
సంక్రాంతి పండగ అయిపోయింది.. ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు ఢమాల్ అని పడిపోయాయి. ధరలు తగ్గుముఖం పట్టడం వరుసగా ఇది మూడో రోజు కావడం విశేషం. గడిచిన మూడు రోజుల్లో బంగారం ధరలు రూ. 680 తగ్గాయి. సంక్రాంతి పండగ రోజున అంటే జనవరి 15వ తేదీన రూ. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58 వేలుగా ఉంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63 వేల 400గా ఉంది. ఆ తరువాత పసిడి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతూ వచ్చాయి.
2024 జనవరి 18వ తేదీన హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 తగ్గి రూ. 57 వేల 400కు చేరుకుంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 330 తగ్గి రూ. 62 వేల 620 కు చేరుకుంది. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ మార్కెట్లో కూడా గోల్డ్ రేటు తగ్గింది. ప్రస్తుతం అక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 350 తగ్గి రూ. 57,850 వద్ద కొనసాగుతోంది. మరోవైపు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 380 పతనమై రూ. 63,100 వద్ద ఉంది. హైదరాబాద్ మాదిరిగానే విజయవాడ, వైజాగ్ లో కూడా ఈవే ధరలు కొనసాగుతున్నాయి,
బంగారం ధరల బాటలోనే వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. గడిచిన మూడు రోజుల్లో కేజీ వెండి ఏకంగా రూ. 13 వందలు తగ్గింది. సంక్రాంతి పండగ రోజున అంటే జనవరి 15వ తేదీన రూ. 78 వేల300 ఉన్న కేజీ వెండి జనవరి 18వ తేదీన రూ.77 వేలకు చేరుకుంది. హైదరాబాద్ మాదిరిగానే విజయవాడ, వైజాగ్ లో కూడా ఈవే ధరలు కొనసాగుతున్నాయి, బంగారం, వెండి ధరలు ప్రాంతాల్ని బట్టి మారుతుంటాయని చెప్పొచ్చు.