స్థిరంగా బంగారం ధరలు.. హైదరాబాద్ లో తులం బంగారం ఎంతంటే?

స్థిరంగా బంగారం ధరలు.. హైదరాబాద్ లో తులం బంగారం ఎంతంటే?

కొత్త సంవత్సరంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలో ప్రస్తుతం బంగారం ధరలు పసిడి ప్రియులను బెంబేలెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో గత మూడు రోజులుగా బంగారం ధరల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. న్యూ ఇయర్ లో బంగారం ధరలు భారీగా పెరుగుతాయని ప్రచారం జరగడంతో ఆందోళనకు గురైన పసిడి కొనుగోలు చేసే వారికి ఇది కాస్త ఊరట కలిగించనుంది. అయితే, రానున్న రోజుల్లో బంగారం ధరలు భారీగా పెరగొచ్చని ట్రేడ్ వశ్లేషకులు చెబుతున్నారు. 2024 జనవరి 2వ తేదీ మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఎన్నాయో చూద్దాం.

హైదరాబాద్:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,550 గా ఉంది.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 63, 870 గా ఉంది. 

విజయవాడ:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,550 గా ఉంది.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 63, 870 గా ఉంది. 
వెండి ధరల్లోనూ ఎలాంటి మార్పులేదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.80,000గా ఉంది.

దేశంలో బంగారం ధరలు

  • దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,700 గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,970 గా ఉంది. కిలో వెండి ధర రూ.78,600
  • దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,550 గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,870 గా ఉంది.కిలో వెండి ధర రూ.78,600
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,100 గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64,470 గా ఉంది. కిలో వెండి ధర రూ.76,000
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,550గా , 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,870గా ఉంది. కిలో వెండి ధర రూ.80,000