Gold and silver rates : ఒక్క రోజులోనే రూ.2 వేలు పెరిగిన వెండి

Gold and silver rates : ఒక్క రోజులోనే రూ.2 వేలు పెరిగిన వెండి

దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఊహించని స్థాయిలో పెరిగాయి .  2023 అక్టోబర్ 08 ఆదివారం  రోజున  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 250 పెరిగి  రూ. 52 వేల 750 కు చేరుకుంది.  ఇక  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  ధర రూ. 310 పెరిగి  రూ. 57  వేల 540 కు చేరుకుంది.  దేశవ్యాప్తంగా  బంగారం, వెండి ధరలు  ఎలా ఉన్నాయో చుద్దాం.

దేశ రాజధాని ఢిల్లీలో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52  వేల 900  ఉండగా,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 57 వేల 690 గా ఉంది. అర్థిక రాజధాని ముంబైలో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52 వేల 750 ఉండగా,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 57 వేల 540  గా ఉంది.

హైదరాబాద్ లో   22  క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52 వేల 750 ఉండగా,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 57 వేల 540  గా ఉంది.  విజయవాడలో  22  క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52 వేల 750 ఉండగా,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ. 57 వేల 540 గా ఉంది. 

ఇక నిన్న స్థిరంగా ఉన్న వెండి ధరలు ఒక్క రోజులోనే రూ.2 వేలు పెరిగాయి.  ప్రస్తుతం మార్కెట్ లో కేజీ వెండి రూ.75 వేలుగా ఉంది.