పెరిగిన బంగారం, వెండి ధరలు.. మార్కెట్లో రేట్లు ఇలా

పెరిగిన బంగారం, వెండి ధరలు.. మార్కెట్లో రేట్లు ఇలా

2023 సెప్టెంబర్ 15 శుక్రవారం రోజున బంగారం, వెండి ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  200 పెరిగి రూ. 54 వేల 700కు చేరుకుంది.  ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  220 పెరిగి రూ. 59 వేల 670కు చేరుకుంది.  

ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54వేల850  ఉండగా , 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59 వేల 820గా ఉంది. దేశ అర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54వేల700  ఉండగా , 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59 వేల 670గా ఉంది.

ఇక హైదరాబాద్ విషయానికి వస్తే..    22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54వేల700 ఉండగా , 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59 వేల 670గా ఉంది.  వెండి ధరల విషయానికి వస్తే కేజీ రూ. 500 పెరిగింది.  ప్రస్తుతం మార్కెట్ లో కేజీ వెండి రూ. 77 వేల 500 గా ఉంది.