
Gold Price Today: 2025 ప్రారంభం నుంచి బంగారం, వెండి రేట్లు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. పారిశ్రామిక అవసరాలకు ఈ విలువైన లోహాల వినియోగం పెరగటంతో పాటుగా అంతర్జాతీయంగా ఉన్న ఆర్థిక భౌగోళిక రాజకీయ అనిశ్చితి వాతావరణం బంగారం, వెండికి డిమాండ్ పెంచుతున్నాయి. ఒకపక్క ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ కోసం సెంట్రల్ బ్యాంకులు తమ గోల్డ్ నిల్వలను పెంచుకుంటుంటే తమ సంపదను హెడ్జింగ్ చేసుకునేందుకు ప్రజలు కూడా వీటి వెంట పడటంతో రిటైల్ డిమాండ్ పీక్స్ కి వెళ్లినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బులియన్ మార్కెట్ దూకుడు చూసి భారతీయ మధ్యతరగతికి మతిపోతోంది.
24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే సెప్టెంబర్ 8తో పోల్చితే 10 గ్రాములకు సెప్టెంబర్ 9న రూ.1360 పెరిగింది. అంటే గ్రాముకు రేటు రూ.136 పెరగటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ రేట్లు ఇలా భగ్గుమంటున్నాయి..
24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(సెప్టెంబర్ 9న):
- హైదరాదాబాదులో రూ.11వేల 029
- కరీంనగర్ లో రూ.11వేల 029
- ఖమ్మంలో రూ.11వేల 029
- నిజామాబాద్ లో రూ.11వేల 029
- విజయవాడలో రూ.11వేల 029
- కడపలో రూ.11వేల 029
- విశాఖలో రూ.11వేల 029
- నెల్లూరు రూ.11వేల 029
- తిరుపతిలో రూ.11వేల 029
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు సెప్టెంబర్ 8తో పోల్చితే ఇవాళ అంటే సెప్టెంబర్ 9న 10 గ్రాములకు రూ.125 పెరుగుదలను చూసింది. దీంతో మంగళవారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే..
ALSO READ : మార్కెట్లోకి బిబా పండుగ కలెక్షన్
22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(సెప్టెంబర్ 9న):
- హైదరాదాబాదులో రూ.10వేల 110
- కరీంనగర్ లో రూ.10వేల 110
- ఖమ్మంలో రూ.10వేల 110
- నిజామాబాద్ లో రూ.10వేల 110
- విజయవాడలో రూ.10వేల 110
- కడపలో రూ.10వేల 110
- విశాఖలో రూ.10వేల 110
- నెల్లూరు రూ.10వేల 110
- తిరుపతిలో రూ.10వేల 110
బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా తమ ర్యాలీని వారాంతంలో కొనసాగిస్తోంది. సెప్టెంబర్ 9న కేజీకి వెండి సెప్టెంబర్ 8తో పోల్చితే రూ.3వేసు పెరగటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.లక్ష 40వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.140 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.