యుద్ధం ముగిసింది బంగారం, వెండి పెరిగింది.. హైదరాబాద్ రేట్లు చూస్తే షాకే..

యుద్ధం ముగిసింది బంగారం, వెండి పెరిగింది.. హైదరాబాద్ రేట్లు చూస్తే షాకే..

అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరటంతో ప్రపంచ వ్యాప్తంగా బులియన్ మార్కెట్లలో జోరు మెుదలైంది. దీంతో మెున్న వారం వరకూ తగ్గుతూ పోయిన బంగారం, వెండి రేట్లకు తిరిగి రెక్కలు వచ్చాయి. దీంతో సోమవారం గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు అమాంతం భారీగా పెరిగాయి. ఈ క్రమంలో షాపింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ నగరాల్లోని రిటైల్ విక్రయ ధరలను పరిశీలించటం చాలా ఉత్తమం. 

జూన్ 15న బంగారం రేట్లు పెరిగాయి. జూన్ 14 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.245 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 153గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 890గా కొనసాగుతోంది. 

సోమవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. జూన్ 15, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు పెరిగింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.10వేలు పెరిగి రూ.2లక్షల 80వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.280 దగ్గర ఉంది.