Gold Rate: వామ్మో.. సోమవారం భారీగానే పెరిగిన గోల్డ్.. హైదరాబాదులో కేజీ వెండి రూ.లక్షా 60వేలు!

Gold Rate: వామ్మో.. సోమవారం భారీగానే పెరిగిన గోల్డ్.. హైదరాబాదులో కేజీ వెండి రూ.లక్షా 60వేలు!

Gold Price Today: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గతవారం చివరిలో ఫార్మా ఉత్పత్తులతో పాటు ఆటో రంగంపై కొత్తగా సుంకాలు విధించటం మళ్లీ ఆందోళనలు పెంచేస్తోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు కొంత అప్రమత్తతను పాటిస్తున్నారు. చాలా మంది ఈ పరిస్థితుల్లో తమ పోర్ట్ ఫోలియోల్లో గోల్డ్, సిల్వర్ కి చోటివ్వటం.. దీనికి తోడు పారిశ్రామిక, సెంట్రల్ బ్యాంకుల నుంచి కూడా లోహాలకు డిమాండ్ అధికంగానే కొనసాగుతుండటం ప్రస్తుత ధరల పెంపులకు దారితీసిందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు తమ షాపింగ్ సమయంలో పెరిగిన రేట్లను ముందుగానే గమనించటం చాలా ముఖ్యంగా తెలుస్తోంది. 

24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే సెప్టెంబర్ 28తో పోల్చితే 10 గ్రాములకు సెప్టెంబర్ 29న రూ.920 పెరిగింది. అంటే గ్రాముకు రేటు రూ.92 పెరగటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ రేట్లు ఇలా భగ్గుమంటున్నాయి..

24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(సెప్టెంబర్ 29న):
హైదరాదాబాదులో రూ.11వేల 640
కరీంనగర్ లో రూ.11వేల 640
ఖమ్మంలో రూ.11వేల 640
నిజామాబాద్ లో రూ.11వేల 640
విజయవాడలో రూ.11వేల 640
కడపలో రూ.11వేల 640
విశాఖలో రూ.11వేల 640
నెల్లూరు రూ.11వేల 640
తిరుపతిలో రూ.11వేల 640

ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు సెప్టెంబర్ 28తో పోల్చితే ఇవాళ అంటే సెప్టెంబర్ 29న 10 గ్రాములకు రూ.850 పెరుగుదలను చూసింది. దీంతో సోమవారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. 

ALSO READ : గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు ఉన్నాయా..?

22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(సెప్టెంబర్ 29న):
హైదరాదాబాదులో రూ.10వేల 670
కరీంనగర్ లో రూ.10వేల 670
ఖమ్మంలో రూ.10వేల 670
నిజామాబాద్ లో రూ.10వేల 670
విజయవాడలో రూ.10వేల 670
కడపలో రూ.10వేల 670
విశాఖలో రూ.10వేల 670
నెల్లూరు రూ.10వేల 670
తిరుపతిలో రూ.10వేల 670

బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా తమ ర్యాలీని వారం ప్రారంభంలో కొనసాగిస్తోంది. సెప్టెంబర్ 29న కేజీకి వెండి సెప్టెంబర్ 28తో పోల్చితే రూ.వెయ్యి పెరగటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.లక్ష 60వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.160 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.