Gold Rate: శనివారం షాకిచ్చిన గోల్డ్ రేట్లు.. కేజీకి రూ.6వేలు పెరిగిన వెండి.. ఇక కొనటం కలలో మాటేనా..!

Gold Rate: శనివారం షాకిచ్చిన గోల్డ్ రేట్లు.. కేజీకి రూ.6వేలు పెరిగిన వెండి.. ఇక కొనటం కలలో మాటేనా..!

Gold Price Today: ప్రస్తుతం బంగారం రేట్ల కంటే కూడా వెండి విపరీతంగా పెరుగుతోంది. పారిశ్రామిక అవసరాలకు వెండిని వినియోగిస్తుంటే సామాన్యులకు కూడా వణుకు పుడుతోంది. దాదాపు ఏడాది కిందితో పోల్చితే దాదాపు 80 శాతానికి పైగా పెరుగుదలను చూసింది. అయితే ఈ రేట్ల ర్యాలీ ఇంకా ఎంత దూరం కొనసాగుతుందనే ఆందోళనలు సామాన్య మధ్యతరగతి ప్రజలను వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో వారంతంలో పెరిగిన వెండి, బంగారం రేట్లను పరిశీలించి షాపింగ్ చేయటం ముఖ్యం తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు.. 

24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే సెప్టెంబర్ 26తో పోల్చితే 10 గ్రాములకు సెప్టెంబర్ 27న రూ.600 పెరిగింది. అంటే గ్రాముకు రేటు రూ.60 పెరగటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ రేట్లు ఇలా భగ్గుమంటున్నాయి..

ALSO READ : ట్రంప్ ఫార్మా టారిఫ్స్ వల్ల భారత కంపెనీలపై ప్రభావం ఇదే..

24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(సెప్టెంబర్ 27న):

హైదరాదాబాదులో రూ.11వేల 548
కరీంనగర్ లో రూ.11వేల 548
ఖమ్మంలో రూ.11వేల 548
నిజామాబాద్ లో రూ.11వేల 548
విజయవాడలో రూ.11వేల 548
కడపలో రూ.11వేల 548
విశాఖలో రూ.11వేల 548
నెల్లూరు రూ.11వేల 548
తిరుపతిలో రూ.11వేల 548

ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు సెప్టెంబర్ 26తో పోల్చితే ఇవాళ అంటే సెప్టెంబర్ 27న 10 గ్రాములకు రూ.550 పెరుగుదలను చూసింది. దీంతో శనివారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. 

22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(సెప్టెంబర్ 27న):

హైదరాదాబాదులో రూ.10వేల 585
కరీంనగర్ లో రూ.10వేల 585
ఖమ్మంలో రూ.10వేల 585
నిజామాబాద్ లో రూ.10వేల 585
విజయవాడలో రూ.10వేల 585
కడపలో రూ.10వేల 585
విశాఖలో రూ.10వేల 585
నెల్లూరు రూ.10వేల 585
తిరుపతిలో రూ.10వేల 585

బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా తమ ర్యాలీని వారాంతంలో కొనసాగిస్తోంది. సెప్టెంబర్ 27న కేజీకి వెండి సెప్టెంబర్ 26తో పోల్చితే రూ.6వేలు పెరగటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.లక్ష 59వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.159 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.