
Gold Price Today: ఇప్పటికే బంగారం ధరలు తులం లక్షకు పైకి చేరుకుని భారతీయులకు అందకుండా పోయాయి. ఇదే క్రమంలో వెండి కూడా గడచిన 6 నెలల్లోనే దాదాపుగా కేజీకి రూ.40వేల వరకు పెరిగింది. ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థతో పాటు ట్రంప్ నిర్ణయాలతో ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఆందోళనలు పసిడి రేట్లకు రెక్కలొచ్చేలా చేస్తున్నాయి. దీంతో భారతీయ మధ్యతరగతికి గోల్డ్, సిల్వర్ కొనలేని స్థాయిలకు చేరుకున్నాయి. అమెరికాకు చెందిన జేపీ మోర్గన్ రీసెర్చ్ ప్రకారం ఔన్సు గోల్డ్ రేటు 4వేల డాలర్లకు చేరవచ్చనే అంచనాలకు అనుగుణంగా ప్రస్తుతం ర్యాలీ కొనసాగుతోంది.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.9వేల 500 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 380, ముంబైలో రూ.9వేల 380, దిల్లీలో రూ.9వేల 395, కలకత్తాలో రూ.9వేల 380, బెంగళూరులో రూ.9వేల 380, కేరళలో రూ.9వేల 380, పూణేలో రూ.9వేల 380, వడోదరలో రూ.9వేల 385, అహ్మదాబాదులో రూ.9వేల 385, జైపూరులో రూ.9వేల 395, మంగళూరులో రూ.9వేల 380, నాశిక్ లో రూ.9వేల 383, అయోధ్యలో రూ.9వేల 395, బళ్లారిలో రూ.9వేల 380, నోయిడాలో రూ.9వేల 395, గురుగ్రాములో రూ.9వేల 395 వద్ద కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.10వేల 400 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేటి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.10వేల 233, ముంబైలో రూ.10వేల 233, దిల్లీలో రూ.10వేల 248, కలకత్తాలో రూ.10వేల 233, బెంగళూరులో రూ.10వేల 233, కేరళలో రూ.10వేల 233, పూణేలో రూ.10వేల 233, వడోదరలో రూ.10వేల 238, అహ్మదాబాదులో రూ.10వేల 238, జైపూరులో రూ.10వేల 248, మంగళూరులో రూ.10వేల 233, నాశిక్ లో రూ.10వేల 236, అయోధ్యలో రూ.10వేల 248, బళ్లారిలో రూ.10వేల 233, నోయిడాలో రూ.10వేల 248, గురుగ్రాములో రూ.10వేల 248గా ఉన్నాయి.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.93వేల 800 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.లక్ష 2వేల 330 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 29వేల వద్ద ఉంది.