బంగారం ధరలు కొండెక్కి కూర్చుకున్నాయి. సామన్యుడు కొనే పరిస్థితి లేదు. ప్రధాని మోదీనే స్వయంగా బంగారం ఇప్పట్లో కొనవద్దని చెప్తున్నారంటే.. పసిడి ఎంత ఫిరమైందో అర్థం చేసుకోవచ్చు. అందుకేనేమో.. ఒక్క దెబ్బతో సెట్ అవ్వాలన్న అత్యాశతోనే కావచ్చు.. దొంగలు బంగారంపైన పడుతున్నారు. 2026 మే 10 (ఆదివారం) న హైదరాబాద్ 50 లక్షల రూపాయల గోల్డ్, సిల్వర్ చోరీ ఘటన కలకలం రేపింది.
హైదరాబాద్ గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. ఓ కుటుంబం పెళ్లికి వెళ్లటంతో ఇల్లు గుల్ల చేశారు. అర్ధరాత్రి తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడి భారీగా బంగారం, వెండి, నగదును ఎత్తుకెళ్లారు.
జైన్ స్కూల్ సమీపంలోని మహేష్ అనే యజమాని ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. బాధితుడు లంగర్ హౌస్ లోని తన బంధువుల పెళ్లికి ఆదివారం ఉదయం వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉండటం గుర్తించాడు. తాళం పగలగొట్టడం చూసి షాకైన యజమాని.. ఇంట్లోకెళ్లి చూడగా.. సామానంతా చెల్లా చెదురుగా పడి ఉండటం గమనించారు.
►ALSO READ | మాజీ ఐపీఎస్ భార్య హత్య కేసులో షాకింగ్ విషయాలు.. నేపాలీ పనిమనిషి ముగ్గురితో కలిసి రెక్కీ నిర్వహించి..
ఇంట్లో తనిఖీ చేయగా సుమారు 30 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.5 లక్షల నగదు దొంగిలించినట్లు గుర్తించారు. హైదరాబాద్ లో తులం బంగారం లక్షా 62 వేల వరకు ఉంది. ఈ లెక్కన 30 తులాలు అంటే 49 లక్షల వరకు ఉంటుంది. అదే విధంగా 30 తులాల వెండి లక్ష రూపాయల వరకు పలుకుతుంది. దీనికితోడు 5 లక్షల డబ్బులతో కలిపి మొత్తం 55 లక్షలకు పైగా సొమ్మును ఎత్తుకెళ్లారు దొంగలు.
వెంటనే గోషామహల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దొంగల కోసం గాలింపు చేపట్టారు
