ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత

ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న దాదాపు 4 కోట్ల విలువ చేసే బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికులను తనిఖీ చేయగా ఏడున్నర కిలోల గోల్డ్ బిస్కెట్లు దొరికాయి. అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అక్రమంగా బంగారు బిస్కెట్లు తీసుకొచ్చిన ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇంత భారీ మొత్తంలో బంగారు బిస్కెట్లు పట్టుపడడం ఈమధ్య కాలంలో ఇదే మొదటిసారి.