
హైదరాబాద్, వెలుగు: బిగ్‌బజార్ తమ కస్టమర్లకు బంగారం, వెండి కాయిన్స్ గిఫ్టులుగా ఇస్తోంది. బిగ్‌బజార్ యాప్‌లో, స్టోర్లలో, వెబ్‌సైట్‌లో ఈ నెల 24 నుంచి నవంబర్ 7 వరకు షాపింగ్‌లో పాల్గొనే కస్టమర్లకు ఈ బెనిఫిట్స్ లభిస్తాయి. రూ.25,000 నుంచి రూ.49,999 వరకు షాపింగ్ చేసినట్లయితే 40 గ్రాముల వెండి నాణేం పొందొచ్చు. రూ.50,000 నుంచి రూ.లక్ష షాపింగ్‌పై 1 గ్రాము బంగారు నాణేం ఇస్తారు. రూ.లక్ష నుంచి రెండు లక్షల వరకు షాపింగ్ చేస్తే 2 గ్రాముల బంగారు నాణేం, రూ.2 లక్షల కంటే ఎక్కువ షాపింగ్ చేస్తే 3 గ్రాముల బంగారు నాణేన్ని ఆఫర్ చేస్తున్నారు. ఈ ఆఫర్లకు అదనంగా రెగ్యులర్‌గా ఇచ్చే డిస్కౌంట్లను కూడా బిగ్‌బజార్ ఆఫర్ చేస్తోంది.