దీపావళి నాటికి రూ.65 వేల మార్కుకు గోల్డ్

దీపావళి నాటికి రూ.65 వేల మార్కుకు గోల్డ్

న్యూఢిల్లీ: దీపావళి కంటే ముందే గోల్డ్ ధర రూ.65 వేల మార్కును, వెండి ధర రూ.90 వేల మార్కు‌‌‌ను తాకుతుందని అనలిస్ట్‌‌‌‌లు అంచనా వేస్తున్నారు. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.730 పెరిగి రూ.53,691గా నమోదైంది. ప్రాఫిట్ బుకింగ్, రష్యా కరోనా వ్యాక్సిన్ విడుదల ప్రకటనతో వరుసగా గోల్డ్ ధరలు పతనమయ్యాయి. ఆ తర్వాత శుక్రవారం నుంచి మళ్లీ గోల్డ్ ధరలు పుంజుకుంటున్నాయి. ఈ వారంలో గోల్డ్, సిల్వర్ ధరలు బాగా ఒడిదుడుకులకు గురైనట్టు తెలిసింది. స్వల్పంగా ఊగిసలాడిన తర్వాత గోల్డ్ రేట్లు మళ్లీ పెరుగుతాయని అనలిస్టులు భావిస్తున్నారు. సిల్వర్ రేట్లు కూడా గోల్డ్ బాటలోనే నడుస్తాయన్నారు .

డిసెంబర్‌ కల్లా గోల్డ్ ధర 2,350 డాలర్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. సిల్వర్ కూడా షార్ట్ టర్మ్‌‌‌‌లో 30 డాలర్లను, డిసెం బర్‌ లో 33 డాలర్లను తాకుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్‌ లో గోల్డ్ ధర ఔన్సుకు 1,951 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. సిల్వర్ ఔన్సుకు 26.91డాలర్లుగా రికార్డయింది. రూపాయి టర్మ్స్‌ లో తీసుకుంటే, గోల్డ్ దీపావళి కల్లా రూ.65 వేల మార్కును, సిల్వర్ రూ.90 వేల మార్కు‌‌‌ను చేరుకుంటుందని కమోట్రెండ్జ్ డైరెక్టర్ జ్ఞానశేఖర్ చెప్పారు.