ఫస్ట్ టైమ్ రూ. 67 వేల మార్క్ దాటిన గోల్డ్... హైదరాబాద్లో తులం ఎంతంటే ?

ఫస్ట్ టైమ్  రూ. 67 వేల మార్క్ దాటిన గోల్డ్...  హైదరాబాద్లో తులం ఎంతంటే ?

హైదరాబాద్‌లో బంగారం ధరలు తొలిసారిగా రూ. 67 వేల మార్కును దాటాయి. ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా బంగారం ధరలు పెరుగుతున్నాయి. మార్చి నెలలోనే బంగారం  ధరలు ఐదు శాతం పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో   22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,800గా ఉండగా..  24  క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,420గా ఉన్నాయి.

మార్చి 1న  హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,900 గా ఉండగా..  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,160గా ఉన్నాయి. హైదరాబాద్‌తో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరల పెరుగుదల  దిశ, భౌగోళిక రాజకీయ పరిస్థితులపైనే కాకుండా ఫెడ్ వడ్డీ రేట్లపై కూడా ఆధారపడి ఉంటుంది.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.  దేశ రాజధాని ఢిల్లీలో   22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,950 గా ఉండగా ..   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,570గా ఉన్నాయి.  ఇక ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,800 గా ఉండగా ..   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,420గా ఉన్నాయి.

వెండి ధరల విషయానికి వస్తే రూ.80 వేలు దాటింది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు  రూ. 1500 పెరిగింది.  ప్రస్తుతం మార్కెట్ లో కేజీ వెండి రూ.  81,500 గా ఉంది. హైదరాబాద్ లో ఇదే ధర కొనసాగుతుంది.