రూ.73 వేలకు బంగారం ధర

రూ.73 వేలకు బంగారం ధర
  •     గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌గా  2,400 డాలర్లను టచ్‌‌‌‌ చేసిన గోల్డ్‌‌‌‌
  •     రూ.90 వేలకు చేరుకున్న కేజి సిల్వర్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు శుక్రవారం కూడా పెరిగాయి. గ్లోబల్‌‌‌‌గా గోల్డ్‌‌‌‌ రేట్లు పెరుగుతుండడంతో మన దగ్గర కూడా దూసుకుపోతున్నాయి. మిడిల్‌‌‌‌ ఈస్ట్‌‌‌‌లో టెన్షన్లు, యూఎస్ ఇన్‌‌‌‌ఫ్లేషన్ పెరగడం వంటి అంశాలు గ్లోల్డ్ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. హైదరాబాద్‌‌‌‌లో  10 గ్రాముల  బంగారం (24 క్యారెట్లు) ధర  శుక్రవారం రూ.1,090  పెరిగి రూ.73,310 కి చేరుకుంది.

అదే 22 క్యారెట్ల గోల్డ్‌‌‌‌ ధర రూ. 1,000 పెరిగి రూ.67,200 కు, 18 క్యారెట్ల గోల్డ్‌‌‌‌ రేట్‌‌‌‌ రూ.82‌‌‌‌‌‌‌‌0 పెరిగి రూ.54,160 కు ఎగిశాయి. మరోవైపు వెండి ధరలు కూడా చుక్కలనంటుతున్నాయి. హైదరాబాద్‌‌‌‌ మార్కెట్‌‌‌‌లో  కేజీ వెండి రేటు శుక్రవారం రూ.1,500 పెరిగి రూ.90 వేలను టచ్‌‌‌‌ చేసింది. ఇంటర్నేషనల్ మార్కెట్ చూస్తే ఔన్స్ గోల్డ్‌‌‌‌ (సుమారు 28 గ్రాములు) రేట్ 2,400 డాలర్లను టచ్‌‌‌‌ చేసింది.  ఇన్‌‌‌‌ఫ్లేషన్ అంచనాల కంటే ఎక్కువగా రికార్డవ్వడంతో  యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల కోతను ఆలస్యం చేస్తుందని మార్కెట్ అంచనా వేస్తోంది. దీంతో గోల్డ్‌‌‌‌ కొనుగోళ్లు ఊపందుకున్నాయి.