పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు

పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు

పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. బంగారం ధరలు సామాన్యులకు షాకిస్తున్నాయి. రెండు రోజుల క్రితం స్పల్పంగా తగ్గిన బంగారం ధరలు ఏప్రిల్ 15వ తేదీ సోమవారం మరోసారి  దేశంలో భారీగా పెరిగాయి.  ఇప్పటికే తులం బంగారం ధర రూ.70 వేలు దాటి పరుగులు పెడుతుంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.550, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.600లు పెరిగింది. దీంతో దేశంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం... 

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,050.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,150గా ఉంది.

ఇక, దేశ రాజధాని ఢిల్లీతోపాటు ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 67,050గా ఉంది.  ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 73,150కి చేరుకుంది. 

బంగారం ధరలతో పాటుగా వెండి ధరలు కూడాపెరిగాయి.  ఈ రోజు వెండిపై రూ.500 తగ్గింది. దీంతో  హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో కేజీ వెండి రూ. 89,500గా ఉండగా... ఢిల్లీ, ముంబై, కోల్ కత్తాలో రూ. 86,000గా ఉంది.