Gold Price : తగ్గుతున్న బంగారం ధరలు

Gold Price  :  తగ్గుతున్న బంగారం ధరలు

దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి.  2024 మార్చి 18వ తేదీన 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 210 తగ్గి రూ. 60 వేల 380కి చేరకుంది. ఇక  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 230 తగ్గి రూ. 65 వేల 870కి చేరకుంది. దేశంలోని పలు ప్రాంతాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.  

దేశ రాజధాని ఢిల్లీలో  10 గ్రాముల  22 క్యారెట్ల బంగారం ధర రూ.  60 వేల 530గా ఉండగా..  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 66 వేల20గా ఉంది. ఇక ఆర్థిక రాజధాని ముంబైలో  10 గ్రాముల  22 క్యారెట్ల బంగారం ధర రూ.  60 వేల 380గా ఉండగా..  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 65 వేల 870గా ఉంది. 

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్ లో 10 గ్రాముల  22 క్యారెట్ల బంగారం ధర రూ.  60 వేల 380 గా ఉండగా..  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 65 వేల870గా ఉంది. విశాఖలో  10 గ్రాముల  22 క్యారెట్ల బంగారం ధర రూ.  60 వేల 380 గా ఉండగా..  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 65 వేల870గా ఉంది.

ఇక వెండి విషయానికి వస్తే  నిన్నటితో పోలిస్తే  కేజీ వెండిపై రూ.  300 తగ్గింది. ప్రస్తు్తం మార్కెట్ లో   కేజీ వెండి రూ. 80 వేలుగా ఉంది.  ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.77,200గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.80,200 వద్ద ట్రేడవుతోంది.

గత వారం రోజులుగా బంగారం ధరలను పరిశీలిస్తే ధరల్లో పెద్దగా మార్పు అయితే కనిపించడం లేదు.  మార్చి 11వ తేదీన  60 వేల 750 గా ఉన్న బంగారం మార్చి 18 నాటికి  60 వేల 380గా ఉంది.